Suzuki Motor Osamu: సుజుకి మోటార్ మాజీ చైర్మన్ ఒసాము మృతి..! 11 d ago
సుజుకి మోటార్ మాజీ చైర్మన్ ఒసాము సుజుకి కన్నుమూశారు. క్యాన్సర్తో బాధపడుతూ ఆయన మృతి చెందినట్లు సుజుకి సంస్థ ప్రకటించింది. 1958లో షోహో సుజుకీని ఒసాము సుజుకి వివాహం చేసుకున్నారు. సుజుకీ కుటుంబానికి వారసులు లేకపోవడంతో వివాహ అనంతరం ఒసాము కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ఆ కంపెనీ బైక్ లు, కార్లు వరల్డ్ వైడ్ గా విస్తరించడంలో కీలకపాత్ర పోషించారు. 2021లోనే ఒసాము సుజుకి చైర్మన్ గా పదవీవిరమణ ప్రకటించారు.